Tuesday, 18 October 2011

అన్వేష్ చంద్ర దారుణ హత్య...

గుడివాడలో 25 రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన ఆరో తరగతి విద్యార్థి అన్వేష్ చంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. అతికిరాతంగా హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. మత్తు మందు ఇచ్చి అన్వేష్‌ను హత్య చేసిన నిందితులు తమ ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు. 6వ తరగతి చదువుతున్న అన్వేష్‌ను కిడ్నాప్‌ చేసి రూ.10లక్షలు డిమాండ్‌ చేశారు.


          పోలీసుల విచారణలో విషయం బయటపడటంతో, తహశీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందుతులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. 
               
         రోజు రోజుకు చిన్న పిల్లల హత్యలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు తగ్గిన జగ్రతలు తిసుకొవలి.