Friday, 16 December 2011
Tuesday, 18 October 2011
అన్వేష్ చంద్ర దారుణ హత్య...
గుడివాడలో 25 రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన ఆరో తరగతి విద్యార్థి అన్వేష్ చంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. అతికిరాతంగా హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. మత్తు మందు ఇచ్చి అన్వేష్‌ను హత్య చేసిన నిందితులు తమ ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు. 6వ తరగతి చదువుతున్న అన్వేష్‌ను కిడ్నాప్ చేసి రూ.10లక్షలు డిమాండ్ చేశారు.
పోలీసుల విచారణలో విషయం బయటపడటంతో, తహశీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందుతులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.
రోజు రోజుకు చిన్న పిల్లల హత్యలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు తగ్గిన జగ్రతలు తిసుకొవలి.
Wednesday, 20 July 2011
Monday, 18 July 2011
పసిపాపల్ని దారుణంగా చంపేశారు ...
బిడ్డ చిరునవ్వు చూసి లోకాన్ని మరచిపోయే తల్లుల్ని చూశాం. పసికందుకోసం కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదురీదే అమ్మల్ని చూశాం. అమ్మతనపు కమ్మదనం సాక్షిగా, మమతల మాధుర్యం తోడుగా ప్రపంచాన్ని ఎదుర్కొనే కడుపుతీపిని చూశాం.
మరొ ప్రక్క తల్లులు తమ ప్రేమాప్యాయతలకన్నా, ముద్దుమురిపాలకన్నా బిడ్డ కడుపు నిండటమే ముఖ్యమనుకున్నా వారు. తమవద్ద ఉండి పస్తులుండేకన్నా ఎక్కడున్నా తమ బిడ్డలు సుఖంగా ఉంటే చాలనుకునే నిస్సహాయస్థితిలో ఉన్న వారు . పిల్లల భవితవ్యంకోసం గత్యంతరం లేక అనురాగాన్ని గుండెలోతుల్లో అదుముకున్న మాతృమూర్తులు ఉన్నరు.
కన్నతల్లి కర్కశురాలా, కారుణ్యం లేనిదా, కాఠిన్యురాలా ? పసిపాపల్ని దారుణంగా చంపేశారు ...
కరీంనగర్ జిల్లాలో జులై 16 న 24 గంటల వ్యవధిలో కోరుట్ల లొ వేర్వేరు ఘటనలు : నిద్రపోతున్న పాపని నీళ్లసంపులో పడేసి ఒకరు.., కన్నబిడ్డ గొంతు నులిమి మరొకరు చంపేశారు ...
నిత్యం రాత్రి వేళ ఏడుస్తూ నిద్ర పోనీయడం లేదనే చిన్న కారణంతో రెండునెలల పసిగుడ్డును కడతేర్చారా కసాయి తల్లిదండ్రులు. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు కూతురును కిడ్నాప్ చేశారనే డ్రామాను తెరపైకి తెచ్చారు. పోలీసుల విచారణలో కట్టుకథ బట్టబయలవటంతో కటకటాల పాలయ్యారు. కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో నివసిస్తున్న కూన రవీందర్, స్వాతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు చెర్రీకి రెండు నెలల 15 రోజుల వయసుంటుంది.
రోజూ రాత్రిపూట నిద్ర పోకుండా ఏడవటమే ఆ పాప చేసిన తప్పుగా కనిపించింది వారికి. అంతేకాదు.. చెర్రీ పుట్టినప్పటి నుంచి తమకు ఏదీ కలిసి రావడంలేదన్న మూఢనమ్మకమూ తోడైంది. కన్నబిడ్డను చంపుకోవడానికి ఆ రెండు కారణాలు చాలనుకున్నారా కర్కోటకులు.
మరోఘటనలోసైతం ఇదే తరహాలో.. లాలించి, పాలించి, అపురూపంగా చూసుకోవాల్సిన కన్నతల్లే కసాయిగా మారింది. ముక్కుపచ్చలారని రెండు నెలల పసిపాపను పీకపిసికేసి చంపేసింది. ఆడపిల్లగా పుట్టడమే ఆ చిన్నారి చేసిన నేరం. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రాంతంలో ఉంటున్న సాదుల్ల దుర్గయ్య, ముత్తవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. రెండు నెలల క్రితం వారికి మరో ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకు సునీత అని పేరుపెట్టారు. ఆడపిల్లను సాకడం కష్టమనుకుందో.. అధిక సంతానం భారమనుకుందోగానీ.. ముత్తవ్వ తన కడుపునపుట్టిన పాపనే గొంతునులిమి చంపేసేందుకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన ఆమె పెద్ద కుమారుడు జగన్ లబోదిబోమంటూ బయటికి వచ్చి కేకలు వేశాడు. స్పృహ కోల్పోయిన సునీతను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పాప మృతి చెందింది.
చంటిబిడ్డ కెవ్వుమంటే చాలు, కన్నపేగు కదిలిపోతుంది. చిన్నారి కేరుమంటే చాలు, తల్లిమనసు తుళ్లిపడుతుంది. ఎక్కడున్నా ఒక్క క్షణంలో బిడ్డ ముందు వాలి అక్కున జేర్చుకుంటుంది. అలాంటి అమ్మే తన బిడ్డను కాదనుకుని చేతులారా చంపేశారు అందుకు కారణం పేదరికం. నిరక్షరాస్యత. ముర్కత్వం ...

Monday, 4 July 2011
Sunday, 19 June 2011
మనుషులపైనా ప్రయోగాలు..... !
ఖమ్మం జిల్లా గిరిజన బాలికలపై చేసిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రయోగం, పర్యవసానాలు మనోఫలకం నుంచి పూర్తిగా చెరగక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం యావత్ ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. నిరక్షరాస్యులు, నిరుపేదలే లక్ష్యంగా ఔషధ కంపెనీలు చేస్తున్న ప్రయోగాలు తాజాగా వెలుగులోకి రావడంతో రాష్ట్రం మరోసారి ఉలిక్కిపడింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో రెక్కాడితేగానీ డొక్కాడని మహిళలకు డబ్బు ఎరగా వేసి ప్రయోగశాలలకు తరలించి చేసిన క్యాన్సర్, హెపటైటిస్ సంబంధిత మందుల ప్రయోగం పుణ్యమా అని తీవ్ర ఆరోగ్య సమస్యలతో అటు కూలిపనికీ, ఇటు ఇంటి పనికీ కాకుండా పోయారు. దళారుల మాయమాటల్లో పడి ఏదో కొద్దిగా రక్తం ఇస్తే పదివేలరూపాయల డబ్బు ముడుతుందన్న చిరు ఆశ తమను ఈ స్థితికి తీసుకొస్తుందని ఊహించని మహిళల బాధ అరణ్యరోదనగానే మిగిలింది.
కొత్తగా తయారుచేసే మందులు ఎంతమేరకు పనిచేస్తాయో తెలుసుకునేందుకు ముందుగా పందులు, ఎలుకల మీద ప్రయోగించడం ప్రపంచంలో ఎక్కడైనా వున్నదే. మన రాజధానిలోని ఫార్మా కంపెనీలు నాలుగడుగులు ముందుకేసి ఏకంగా మనుషులమీదే ప్రయోగించబూనుకున్నాయి. అందుకు దళారుల ద్వారా డబ్బును ఎరగా వేశాయి. అంతా అత్యంత రహస్యంగా చేసేశాయి. ఆ మందులు మంచే చేస్తాయో చెరుపే చేస్తాయో ఏకంగా ప్రాణాలే తీస్తాయో తెలీని బీదాబిక్కీ అమాయకంగా ఆ ఉచ్చులో చిక్కుకున్నారు.
భవిష్యత్తులో ఏ ఇతర కంపెనీలు ఈ విధంగా బరితెగించకుండా నిబంధనలను కఠినతరం చేయాలి. వెనువెంటనే అనుమతి లేని ఔషధ ప్రయోగాలను నిలిపివేయాలి. ప్రయోగాలకు పాల్పడుతున్న ఔషధ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా నిరంతరం స్పృహతో వుంటే తప్ప ఇటువంటి దారుణ 'ప్రయోగాల' నుంచి బయటపడలేరు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రయోగాల సందర్భంగా పార్లమెంటు లోపల వెలుపల వామపక్షాల చొరవతో జరిగిన చర్చల మూలంగానే కేంద్రం దిగి వచ్చి సంబంధిత కంపెనీకిచ్చిన అనుమతిని రద్దు చేసిండి.
Friday, 20 May 2011
Subscribe to:
Posts (Atom)